ఓవర్సీస్ లో 22 కోట్ల ని వసూల్ చేసిన రంగస్థలం


Rangasthalam Latest USA Box Office Collectionఓవర్సీస్ లో సంచలనం సృష్టిస్తున్నాడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ . మార్చి 30న విడుదలైన రంగస్థలం మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భారత్ లొనే కాకుండా ఓవర్సీస్ సైతం రంగస్థలం చిత్రానికి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షక దేవుళ్ళు. దాంతో మూడు వారాల్లో మూడు మిలియన్ డాలర్ల కు పైగా వసూల్ చేసింది.

ఇప్పటి వరకు భారత కరెన్సీ లో 22 . 55 కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టిస్తున్నాడు చరణ్ . 22 కోట్లకు పైగా వసూల్ చేసినప్పటికి ఇంకా స్ట్రాంగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది రంగస్థలం . దాంతో ట్రేడ్ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ రంగస్థలం సాధిస్తున్న విజయాన్ని గురించి అది సాధిస్తున్న కలెక్షన్స్ గురించి ట్వీట్ చేసాడు. రంగస్థలం 1980 కాలం నాటి పల్లెటూరి కథ అయినప్పటికీ ఓవర్సీస్ లో ప్రభంజనం సృష్టిస్తుండటంతో ఆ చిత్ర బృందం సంతోషంగా ఉంది.