రంగస్థలం అక్కడ కూడా సంచలనమేనా ?


Ram Charan
Rangasthalam Kannada Poster

గత ఏడాది విడుదలై తెలుగునాట సంచలనం సృష్టించిన చిత్రం రంగస్థలం . రాంచరణ్ – సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించగా 200 కోట్ల పైచిలుకు వసూళ్ల ని సాధించి రాంచరణ్ చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలవడమే కాకుండా నాన్ బాహుబలి చిత్రాల్లో నెంబర్ వన్ గా నిలిచింది . కట్ చేస్తే ఈ రంగస్థలం తాజాగా కన్నడంలో డబ్ అయ్యింది .

అదేంటి కన్నడ భాషలో డబ్బింగ్ చిత్రాలను నిషేదించారు కదా ! అనే కదా డౌట్ ! ఇన్నాళ్లు అదే నిషేధం ఉండేది కానీ ఇటీవలే ఆ నిషేధాన్ని తొలగించారు దాంతో రంగస్థలం కు కన్నడనాట విపరీతమైన డిమాండ్ ఏర్పడింది .

ఈనెల 12 న విడుదల కానుంది అక్కడ . దాంతో రికార్డుల మోత మోగడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఇక కన్నడంలో ఈ సినిమా పేరు రంగస్థల . మరో వారం రోజుల్లోనే ఏంటి ? అనేది తేలిపోనుంది .