రంగస్థలం టాక్ ఎలా ఉందంటే


rangasthalam overseas talkరాంచరణ్ – సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రంగస్థలం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ముందుగానే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆ షోల ప్రకారం రంగస్థలం టాక్ ఎలా ఉందో తెలుసా ……

 

ఫస్టాఫ్ అదిరిపోతుందట, సెకండాఫ్ లో కొంచెం బోరింగ్ సీన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ గా రంగస్థలం సూపర్ హిట్ అని అంటున్నారు. చరణ్ అద్భుత నటన , సమంత యాక్టింగ్, జగపతిబాబు విలనిజం సుకుమార్ దర్శకత్వ ప్రతిభ ……. దేవిశ్రీప్రసాద్ నేపథ్య సంగీతం వెరసి రంగస్థలం సూపర్ హిట్ గా తేల్చేశారు. ఓవర్సీస్ లో భారీ హిట్ కాదు కాని తెలుగు రాష్ట్రాల లో మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని నమ్మకంగా ఉన్నారు ఆ చిత్ర బృందం.