రంగస్థలం చిత్రాన్ని ఆస్కార్ కు పంపించాలట


Rangasthalam to be nominated  ascar says pawankalyanదక్షిణాది ఉత్తరాది అనే భేదం లేకుండా రంగస్థలం చిత్రాన్ని ఆస్కార్ కు పంపించాల్సిన అవసరం ఉందని ,అప్పుడు తప్పకుండా రంగస్థలం చిత్రానికి అవార్డులు రావడం ఖాయమని అంటున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నిన్న సాయంత్రం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ లోగల పోలీస్ లైన్స్ లో రంగస్థలం విజయోత్సవ వేడుక జరిగింది. ఈవేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తాడు పవన్ .

ఒక్క చరణ్ ని మాత్రమే కాకుండా ఆ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణుల ను అలాగే నటీ నటులను ఒక్కొక్కరి గురించి వివరిస్తూ మాట్లాడటంతో రంగస్థలం చిత్ర బృందం తెగ సంతోషపడింది. పవన్ కళ్యాణ్ ఇంతగా చరణ్ ని పొగడటం చాలామంది ని ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే కొంతకాలంగా మెగా కుటుంబానికి పవన్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.