యువ హీరో కాదు.. అల వైకుంఠపురములో రీమేక్ కు టాప్ హీరో?



యువ హీరో కాదు.. అల వైకుంఠపురములో రీమేక్ కు టాప్ హీరో?
యువ హీరో కాదు.. అల వైకుంఠపురములో రీమేక్ కు టాప్ హీరో?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన అల వైకుంఠపురములో చిత్రం ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికీ తెల్సిందే. కేవలం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులనే కాక ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు భాషాబేధం లేకుండా అంతర్జాతీయ స్థాయిలో సూపర్ హిట్ అయ్యాయి. ఈ సినిమాను రీమేక్ చేయడానికి వివిధ భాషల వారు ఒప్పందాలు చేసుకున్నారు. బాలీవుడ్ నుండి నిర్మాత అశ్విన్ వర్దె హిందీ రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నాడు. అప్పటి నుండి ఈ సినిమా హిందీ రీమేక్ పై బోలెడన్ని వార్తలు వస్తున్నాయి.

మొదటగా ఈ సినిమాలో షాహిద్ కపూర్ లేదా అక్షయ్ కుమార్ లు నటించనున్నారని అన్నారు. అలా కాదు ఈ సినిమాలో నటించడానికి నేనే సూట్ అవుతాను అని యువ హీరో కార్తీక్ ఆర్యన్ స్టేట్మెంట్ తో అందరూ ఈ యువ హీరో ఫిక్స్ అని అనుకుంటూ వచ్చారు. అయితే ఈ చిత్ర రీమేక్ కు సంబంధించిన తాజా సమాచారం ప్రకారం టాప్ హీరో రణ్వీర్ సింగ్ ఈ సినిమా రీమేక్ లో నటించనున్నాడట. మరి ఇదైనా నిజమేనా లేక మరో రూమర్ గా మిగిలిపోతుందా అన్నది చూడాలి. ఏదేమైనా అల వైకుంఠపురములో హిందీ రీమేక్ పై చాలానే అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా తెలుగు సక్సెస్ ను రిపీట్ చేయగలదేమో చూడాలి.