రణవీర్ ని అప్పుడే దీపికా కట్టడి చేస్తోందా?


రణవీర్ ని అప్పుడే దీపికా కట్టడి చేస్తోందా?
రణవీర్ ని అప్పుడే దీపికా కట్టడి చేస్తోందా?

బాలీవుడ్ లో వున్న మోస్ట్ క్రెజీ జోడీ రణవీర్ సింగ్ , దీపికా పడుకునే. గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలిన ఈ జంట అంగరంగ వైభవంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుని ఒక్కటైన విషయం తెలిసిందే. వివాహానంతరం బాలీవుడ్ లో ముచ్చటైన జంటగా ప్రశంసలు పొందుతున్నారు.

కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఇంటి పట్టునే వుంటున్నారు. నిత్యం క్షణం తీరికలేకుండా బిజీగా గడిపేసే ఈ జంట లాక్డౌన్ కారణంగా ఒకరితో ఒకరు కలిసిగడిపే సమయం చిక్కడంతో ఈ సమయాన్ని బాగానే వినియోగించుకుంటుంన్నారట.
అయితే రణవీర్ ని దీపిక డామినేట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రతివిషయంలోనూ రణవీర్ ని కట్టడి చేస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ విషయం బయటపడింది. ఆయుశ్మాన్ ఖురానా తో సరదాగా రణవీర్ సింగ్ ఇన్ స్టా లైవ్ లో పాల్గొన్నాడు. ఇద్దరిమధ్య సంభాషణ ఇంట్రెస్టింగ్ గా సాగుతుండగానే రణవీర్ లైవ్ మద్యలో ఇక ఉంటా బై బై అని చెప్పేసాడు. ’అప్పుడే బై బై ఏంటి అని ఆయుశ్మాన్ అందంతో ’మీ వదిన తిడుతోంది. గట్టిగా మాట్లాడొద్దంటోంది. తాను జూమ్ చాట్ లో వుంది’ అని రణవీర్ లైవ్ నుంచు నిష్క్రమించాడు. దీంతో నెటిజన్స్ అంతా అప్పుడే రణ్ వీర్ని కట్టడి చేస్తోదే అని సెటైర్లు వేస్తున్నారు.