ఫొటోస్టోరీ: ర‌ణ్‌వీర్ రెట్రో ట్రీట్ అదుర్స్‌!ఫొటోస్టోరీ: ర‌ణ్‌వీర్ రెట్రో ట్రీట్ అదుర్స్‌!
ఫొటోస్టోరీ: ర‌ణ్‌వీర్ రెట్రో ట్రీట్ అదుర్స్‌!

బాలీవుడ్‌లో మోస్ట్ హైప‌ర్ యాక్టీవ్ హీరో ర‌ణ్‌వీర్‌సింగ్‌. వ‌రుస విజ‌యాల‌తో ఆక‌ట్టుకుంటున్న ఆయ‌న నిత్యం కొత్త త‌ర‌హా కాస్ట్యూమ్స్‌తోనూ బాలీవుడ్‌లో సంద‌డి చేస్తున్నారు. గ‌త కొంత కాలంగా ఫ్యాష‌న్‌కి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలుస్తున్న ర‌ణ్‌వీర్ చాలా సంద‌ర్భాల్లో చిత్ర‌మైన డ్రెస్సింగ్ స్టైల్‌లో వార్త‌ల్లో నిలుస్తూ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నారు. తాజాగా శ‌నివారం ముంబై ఏయిర్ పోర్ట్‌లో రెట్రో లుక్‌తో ద‌ర్శ‌న‌మిచ్చిన ర‌ణ్‌వీర్‌ని చూసిన వారంతా ఒక్క‌సారిగా అవాక్క‌య్యార‌ట‌.

బ్లాక్ క‌ల‌ర్ ష‌ర్ట్‌, 80వ ద‌శ‌కం బ్యాగీ స్టైల్ పాంట్‌తో రెట్రోలుక్‌ని త‌ల‌పించారు. బ్లాక్ ష‌ర్ట్‌పై వైట్ క‌ల‌ర్ డాట్స్‌తో వెరైటీగా డిజైన్ చేయించారు. మ‌ల్టీ క‌ల‌ర్ స్ట్రీప్ప్‌డ్ పాండ్‌లో ర‌ణ్‌వీర్ జిగేల్ మంటూ మెరిసిపోతున్నారు. ఈ కాంబినేష‌న్ డ్రెస్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ర‌ణ్‌వీర్ ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.

ర‌ణ్‌వీర్‌సింగ్ 1983 వ‌ర‌ల్డ్ క‌ప్ ఆధారంగా పొందిన `83` చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ చిత్రం హిందీతో పాటు దేశ వ్యాప్తంగా వున్న ప్ర‌ధాన భాష‌ల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయి రిలీజ్‌కు సిద్ధ‌మవుతుండ‌టంతో ర‌ణ్‌వీర్ కొత్త సినిమా `జ‌యేష్‌భాయ్ జోర్‌దార్‌` ప‌నుల్లో బిజీ అయిపోయారు. `అర్జున్‌రెడ్డి` ఫేమ్ షాలిని పాండే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.