250 కోట్ల దిశగా హిందీ టెంపర్


Ranveer singh Simmba running towards 250 crores
Ranveer singh

తెలుగులో సూపర్ హిట్ అయిన టెంపర్ హిందీలో ” సింబా ” గా రీమేక్ అయిన విషయం తెలిసిందే . గతవారం విడుదలైన సింబా భారీ వసూళ్లు సాధిస్తూ మొదటి వారంలో 150 కోట్ల గ్రాస్ వసూళ్ల ని సాధించింది . ఇక ఈ వారం హిందీలో పెద్దగా సినిమాలు రిలీజ్ కావడం లేదు దాంతో సింబా మరో వంద కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ట్వీట్ చేసాడు ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ . ఈ సినిమాకు మొదట యావరేజ్ సినిమా అనే టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా లేకపోవడంతో సింబా భారీ వసూళ్లు సాధిస్తున్నాడు . 250 కోట్ల దిశగా దూసుకుపోతోంది సింబా .

ఎన్టీఆర్ పోషించిన పాత్రని హిందీలో రణ్ వీర్ సింగ్ పోషించాడు . తెలుగు వాళ్ళు ఎన్టీఆర్ తో రణ్ వీర్ నటన పోల్చి చూసి తక్కువ చేసారు కానీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం ఈ హీరోని తెగ పొగిడేస్తున్నారు . ఎందుకంటే ఈ మధ్య భారీ చిత్రాలన్నీ ఘోర పరాజయాలు పొందాయి మరి . రణ్ వీర్ సరసన సారా అలీఖాన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహించాడు .

English Title: Ranveer singh Simmba running towards 250 crores