గల్లీ బాయ్ ఫస్ట్ డే వసూళ్లు


Ranvir singh's Gully boy first day collections

రణ్ వీర్ సింగ్అలియా భట్ లు జంటగా నటించిన గల్లీ బాయ్ నిన్న రిలీజ్ అయిన విషయం తెలిసిందే . నిన్న రిలీజ్ అయిన గల్లీ బాయ్ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద సరైన పోటీ ఏది లేకపోవడంతో మొదటి రోజున మంచి వసూళ్లు సాధించింది . 18. 70 కోట్ల వసూళ్ల ని మొదటి రోజున వసూల్ చేసి సంచలనం సృష్టించింది గల్లీ బాయ్ చిత్రం .

 

రణ్ వీర్ సింగ్ తో అలియా భట్ చేసిన రొమాంటిక్ సీన్స్ కి ప్రేక్షకుల నుండి పెద్ద ఎత్తున అప్లాజ్ వస్తోంది . జోయా అక్తర్ రూపొందించిన ఈ చిత్రం కు రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చాయి దాంతో మరిన్ని వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది . రణ్ వీర్ సింగ్ గత ఏడాది సింబా చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకోగా తాజాగా గల్లీ బాయ్ మంచి ఓపెనింగ్స్ సాధించి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది . దాంతో గల్లీ బాయ్ కూడా హిట్ అయినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .

 

English Title: Ranvir singh’s Gully boy first day collections