రావు రమేష్ ఇంట విషాదం


Rao ramesh mother is no moreవిలక్షణ నటుడు రావు రమేష్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. రావు రమేష్ తల్లి కమల కుమారి ( 77) ఈరోజు ఉదయం తెల్లవారుజామున హైదరాబాద్ లోని రావు రమేష్ ఇంట్లో తుదిశ్వాస విడిచింది. 80 వ దశకంలో విలన్ గా తెలుగు చలనచిత్ర రంగాన్ని ఓ ఊపు ఊపేసిన నటుడు రావు గోపాలరావు సతీమణి ఈ కమల కుమారి.

తెలుగు రాష్ట్రాల లోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో సైతం హరికథా గానం చేశారు కమల కుమారి. దాదాపు అయిదు వేల ప్రదర్శన లు ఇచ్చారు కమల కుమారి. ఆమె మరణంతో రావు రమేష్ తీవ్ర దుఃఖసాగరంలో మునిగాడు. గతకొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడి మరణించిన కమల కుమారి మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.