టాలీవుడ్ లో మరింత బిజీ కానున్న రావు రమేష్

టాలీవుడ్ లో మరింత బిజీ కానున్న రావు రమేష్
టాలీవుడ్ లో మరింత బిజీ కానున్న రావు రమేష్

రావు రమేష్ తన తండ్రికి తగ్గ పేరుతో దూసుకుపోతున్నాడు. నెమ్మదిగా విలన్ పాత్రలతో, క్యారెక్టర్ పాత్రలతో రావు రమేష్ తన సినీ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఆపై ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పాత్రలతో రావు రమేష్ టాప్ స్థానానికి చేరుకున్నాడు. ప్రకాష్ రాజ్ తర్వాత విలక్షణ పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచాడు రావు రమేష్.

ఒక డైలాగ్ ను తనదైన శైలిలో విరిచి మాట్లాడడం రావు రమేష్ స్పెషాలిటీ. ప్రస్తుతం కెరీర్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ నటుడు. రీసెంట్ గా ప్రతిరోజూ పండగేలో కనిపించాడు ఈ విలక్షణ నటుడు. ఇక శ్రీకారం, లవ్ స్టోరీ, A1 ఎక్స్ప్రెస్ సినిమాల్లో నటించాడు. నాని నటించిన టక్ జగదీష్ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించిన విషయం తెల్సింది.

ఈ సినిమాలో రావు రమేష్ పాత్ర చాలా కొత్తగా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. టక్ జగదీష్ సినిమాలో రావు రమేష్ రోల్ మెయిన్ హైలైట్ గా నిలుస్తుందిట. ప్యాన్ ఇండియా సినిమా కేజిఎఫ్ చాప్టర్ 2లో కూడా రావు రమేష్ ప్రముఖ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమాల తర్వాత ఆయన రేంజ్ మరింత పెరగడం ఖాయం.