రావు రమేష్ అల్లు అర్జున్ సినిమా నుండి తప్పుకున్నాడట


Allu-Arjun-and-Rao-Ramesh
Allu-Arjun-and-Rao-Ramesh

క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేష్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది , అయితే అతడు ఎందుకు తప్పుకున్నాడో మాత్రం తెలియడం లేదట . త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ” ఏ ఏ 19 ” చిత్రంలో రావు రమేష్ ని కీలక పాత్ర కోసం ఎంపిక చేశారట . కొంత షూటింగ్ కూడా అయ్యింది కానీ సెడన్ గా అల్లు అర్జున్ సినిమా నుండి రావు రమేష్ తప్పుకోవడం సంచలనంగా మారింది .

ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి . అల్లు అర్జున్ డైరెక్షన్ డిపార్ట్ మెంట్ మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అలాగే అల్లు అర్జున్ క్యారవాన్ కు సైబరాబాద్ పోలీసులు ఫైన్ వేసినట్లు పుకార్లు వస్తుండగా ఇప్పుడేమో రావు రమేష్ సినిమా నుండి తప్పుకున్నాడని మరో వార్త హల్చల్ చేస్తోంది .