ఛాన్స్ ఇస్తానని రేప్ చేసాడట


Rape case filed aganist Producer Vaishak Rajan
Vaishak Rajan

నేను నిర్మించబోయే సినిమాలో హీరోయిన్ గా నీకు ఛాన్స్ ఇస్తానని నమ్మించి ఓ మోడల్ ని రేప్ చేసాడట మలయాళ నిర్మాత వైశాఖ్ రాజన్ దాంతో తనపై అత్యాచారం చేసిన నిర్మాతపై కేసు పెట్టింది మోడల్ దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఎర్నాకుళంలో జరిగింది . వైశాఖ్ రాజన్ మలయాళంలో పలు చిత్రాలను నిర్మించాడు . తాజాగా మరో సినిమా నిర్మాణానికి పూనుకున్నాడు .

అయితే ఓ మోడల్ కు హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తానని ఆడిషన్స్ కు రావాల్సిందిగా కోరాడట ! వైశాఖ్ రాజన్ అంటే సినిమాలు నిర్మించిన వ్యక్తి కావడంతో ఏమాత్రం భయపడకుండా నిర్మాత గెస్ట్ హౌజ్ కి వెళ్ళింది మోడల్ . అయితే పిలవగానే గెస్ట్ హౌజ్ కి రావడంతో తన కామవాంఛ తీర్చుకున్నాడు ఈ నిర్మాత . రేప్ కి గురైన మోడల్ పోలీసులను ఆశ్రయించడంతో వైశాఖ్ రాజన్ పై రేప్ కేసు నమోదు చేసారు పోలీసులు .

 

English Title: Rape case filed aganist Producer Vaishak Rajan

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w&layout=gallery[/embedyt]