‘మహా సముద్రమ్’లో రాశిఖన్నా!


Rashi Khanna Act in Ravi Teja Maha Samudram Film
Rashi Khanna Act in Ravi Teja Maha Samudram Film

మాస్ మహా రాజా రవితేజ నటించబోతున్న మహా సముద్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా ఒకే అయిందని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి..

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో ఒక్కసారిగా పాపులర్ అయిన దర్శకుడు అజయ్ భూపతి మహా సముద్రం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రంలో ముందుగా అదితి రావ్ హైడ్రి ని హీరోయిన్ గా అనుకున్నారు.. ఏమైందో ఏమో కానీ సడన్ గా రాశి పేరు పరిశీలనలోకి వచ్చింది. అదితి డేట్స్ కుదరక ఆ అవకాశం రాశిని వరించింది.

ఇంతకుముందు రవితేజ, రాశికన్నా కలయికలో బెంగాల్ టైగర్, టచ్ చేసి చూడు, చిత్రాలు వచ్చాయి.. రాజా ది గ్రేట్ చిత్రంలో కూడా రాశి ఖన్నా ఓ పాటలో తళుక్కున మెరిసింది. ఇప్పుడు ముచ్చటగా మూడో సారి రవితేజతో నటించడం హాట్ టాపిక్
అయింది.

ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ అధినేత జెమినీ కిరణ్ నిర్మించనున్నారని తెలిసింది.. డిసెంబర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2020లో రిలీజ్ కానుంది..!