రౌడీపైనే ఆశలు పెట్టుకున్న రాశి ఖన్నా


Raashi Khanna
రౌడీపైనే ఆశలు పెట్టుకున్న రాశి ఖన్నా

రాశి ఖన్నా ఇండస్ట్రీకి పరిచయమై చాలా కాలమైంది. ఈ భామ కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్లు కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ రాశి కెరీర్ మిడ్ రేంజ్ హీరోలను దాటి టాప్ రేంజ్ కు వెళ్ళలేదు. ఎన్టీఆర్ తో జై లవకుశ చేసినా అది అనుకున్నంత రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఆమె టాప్ హీరోల రేంజ్ కి వెళ్ళలేదు.

అలా అని చెప్పి రాశి ఖన్నా ఖాళీగా ఉందని కాదు, చాలా బిజీగానే ఉంది. ఆమె ఖాతాలో ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్, వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాల్లో నటిస్తోంది. మిగతా సినిమాలు హిట్ అయితే బానే ఉంటుంది కానీ విజయ్ దేవరకొండ తో చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ హిట్ అయితే మాత్రం తన కెరీర్ టర్న్ అయిపోతుందని ఆశపడుతోంది. విజయ్ దేవరకొండతో గతంలో నటించిన రష్మిక గీత గోవిందం ద్వారా ఎంత పెద్ద స్టార్ అయిపోయిందో చెప్పక్కర్లేదు. మహేష్, అల్లు అర్జున్ లాంటి వారి నుండి పిలుపులు వచ్చాయి.

అందుకే అన్ని సినిమాల కంటే ఎక్కువ వరల్డ్ ఫేమస్ లవర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని రాశి ఖన్నా కోరుకుంటోంది. మరి ఆమె ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి.