రాశి ఖన్నా ట్రోల్స్ గురించి చదివిందిట!

Rashi Khanna says World Famous Lover has the best story in her entire career
Rashi Khanna says World Famous Lover has the best story in her entire career

హీరోయిన్ గా రాశి ఖన్నా ఇప్పుడు బెస్ట్ ఫేజ్ లో ఉంది. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు సినిమాలకు పరిచయమైన రాశి, కెరీర్ లో మొదట ఎక్కువగా ప్లాప్స్ పలకరించడంతో కెరీర్ ఆశించినంత ముందుకెళ్ళలేదు. అయితే అందంతో పాటు అభినయం కూడా ఉన్న ఈమెకు అవకాశాలకు కొదవ లేకుండా పోయింది. ఇటీవలే బాగా సన్నబడి నాజూకు అందాలతో యువతకు ఎర వేస్తున్న ఈ భామ, లాస్ట్ ఇయర్ వరస వారాల్లో విడుదలైన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే చిత్రాల ద్వారా వరస సక్సెస్ లను అందుకుంది. ముఖ్యంగా ప్రతిరోజూ పండగే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విజయ్ దేవరకొండ సరసన రాశి నటించిన ఈ సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. నిన్న ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది.

థియేట్రికల్ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించిందనే చెప్పాలి. చిత్రంపై అంచనాలను పెంచింది. అయితే ఈ ట్రైలర్ లాంచ్ లో రాశి ఖన్నా మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిత్ర టీజర్ విడుదలయ్యాక రాశి ఫ్యాన్స్ బాగా హర్ట్ అయిన విషయం తెల్సిందే. టీజర్ లో ఆమె విజయ్ తో నటించిన లిప్ కిస్ సీన్లు, బెడ్ రూమ్ సీన్లు చూసి ఫ్యాన్స్ ఇలాంటి సినిమా ఎందుకు చేశావన్నట్లుగా రాశిని ప్రశ్నించారు. కొంత మంది ట్రోల్స్ కూడా చేశారు. ఈ విషయం గురించి ప్రస్తావించిన రాశి తన ఫ్యాన్స్ హర్ట్ అయిన విషయం తెలిసి తాను కూడా బాధపడ్డానని, అయితే మీరు అనుకున్నట్లు చిత్రంలో ఉండదని, టీజర్ చూసాక కలిగినఅభిప్రాయం, చిత్రం చూసాక పూర్తిగా మారిపోతుందని ఆమె తెలిపింది. టీజర్ చూసాక కథ విషయంలో ఏవేవో అంచనాలు పెట్టుకున్నారు. అయితే అంచనాలకు భిన్నంగా సాగుతుందీ చిత్రం. తన కెరీర్ లో కథ పరంగా ఇదే బెస్ట్ సినిమా అని తేల్చి చెప్పేసింది రాశి. మరి అమ్మడు ఇంత కాన్ఫిడెంట్ గా ఉందంటే సినిమాలో విషయముందనే అనుకోవాలి.