ఆ హీరోతో లిప్ లాక్ చేయాలనీ ఆశపడుతున్న రాశి ఖన్నా


ఆ హీరోతో లిప్ లాక్ చేయాలనీ ఆశపడుతున్న రాశి ఖన్నా
విజయ్ దేవరకొండ మరియు రాశి ఖన్నా

హీరోయిన్ రాశి ఖన్నా టాలీవుడ్ క్రేజ్ హీరో తో లిప్ లాక్ చేయాలని ఆశపడుతోంది . ఇంతకీ రాశి ఖన్నా లిప్ లాక్ చేయాలనీ ఆశపడుతున్న హీరో ఎవరో తెలుసా …… టాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న విజయ్ దేవరకొండ . లిప్ లాక్ లకు టాలీవుడ్ లో పెట్టింది పేరు విజయ్ దేవరకొండ . అర్జున్ రెడ్డి చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు , ఆ తర్వాత గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో ట్రెండ్ సృష్టించాడు . అలాంటి హీరోతో లిప్ లాక్ చేయాలనీ ఆశపడుతోంది రాశి ఖన్నా .

తాజాగా ఈ భామ తమిళంలో అయోగ్య అనే చిత్రంలో నటించింది . తెలుగులో సంచలన విజయం సాధించిన టెంపర్ చిత్రానికి రీమేక్ అయోగ్య . కాగా ఆ చిత్ర ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వచ్చిన రాశి ఖన్నా విజయ్ దేవరకొండ మీదున్న క్రష్ ని తెలిపింది . అన్నట్లు విజయ్ దేవరకొండ తదుపరి చిత్రంలో రాశి ఖన్నా నటిస్తోంది . మరి ఆ సినిమాలో లిప్ లాక్ చేసి తన కోరిక తీర్చుకుంటుందేమో చూడాలి .