నిప్పులు చెరిగిన రష్మీ


Rashmi fires on navjot singh sidhu

మంత్రి , మాజీ క్రికెటర్ అయిన నవజ్యోత్ సింగ్ సిద్దూ పై నిప్పులు చెరిగింది హాట్ భామ రష్మీ . పుల్వామా లో భారత సైనికులను పొట్టన పెట్టుకున్న సంఘటనలో ఉగ్రవాదానికి మతం , దేశం అనేది ఉండదని పాకిస్థాన్ కు మద్దతుగా సిద్దు మాట్లాడటంతో ఆవేశంతో ఊగిపోయింది రష్మీ . అంతేకాదు సిద్దు ని మాత్రమే కాకుండా పాకిస్థాన్ కు మద్దతుగా మాట్లాడుతున్న మరికొంతమందిని కూడా టార్గెట్ చేసింది రష్మీ .

 

పాకిస్థాన్ వెళ్లిపొండిరా అంటూ నిప్పులు చెరుగుతోంది . రష్మీ లోని ఆవేశానికి , దేశభక్తి కి ఉప్పొంగిపోతున్న మిగతా నెటిజన్లు రష్మీ కి మద్దతుగా నిలుస్తున్నారు . జమ్మూ కాశ్మీర్ లో జరిగిన సంఘటనతో జాతి యావత్తు పాకిస్థాన్ పై పగ సాధించాలి అంటూ పట్టుబడుతున్నారు . ఇక సైనికులు కూడా పగతో రగిలిపోతున్నారు ప్రతీకార చర్య కోసం .

English Title: Rashmi fires on navjot singh sidhu