నిన్నసుడిగాలి సుధీర్‌.. నేడు ర‌ష్మీగౌత‌మ్..?


నిన్నసుడిగాలి సుధీర్‌.. నేడు ర‌ష్మీగౌత‌మ్..?
నిన్నసుడిగాలి సుధీర్‌.. నేడు ర‌ష్మీగౌత‌మ్..?

నటి .. బుల్లితెర క్రేజీ యాంక‌ర్ ర‌ష్మీ గౌత‌మ్ కు క‌రోనా సోకిన‌ట్టు తెలిసింది. ఇటీవ‌ల ఆమెతో క‌లిసి హోస్ట్‌గా వ్య‌వ‌హ‌నిస్తున్న సుడిగాలి సుధీర్ క‌రోనా బారిన ప‌డ్డారంటూ ఇటీవ‌ల వార్త‌లు వినిపించిన విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల నేప‌థ్యంలో అత‌నితో అత్యంత స‌న్నిహితంగా వుండే యాంక‌ర్ ర‌ష్మీగౌత‌మ్ కు కూడా క‌రొనా సోకిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

సుడిగాలి సుధీర్ కు క‌రోనా సోకింద‌ని తెలిసిన వెంట‌నే ర‌ష్మీగౌత‌మ్ రోటీన్ చెక‌ప్ కోసం కోవిడ్ టెస్ట్ చేయించుకుంద‌ట‌. టెస్టుల్లో ర‌ష్మీకి పాజిటివ్ అని తేలిన‌ట్టు తెలిసింది. రష్మి ఇటీవలే సుడిగాలి సుధీర్‌తో కలిసి స్పెషల్ ఫెస్టివల్ ఎంటర్టైనర్ ‘అక్కా ఎవారే అత‌గాడు’ లో పాల్గొన్నారు. రష్మి డాన్స్ పెర్ఫార్మెన్స్, సుధీర్ అతిథి పాత్ర చేశారు. ఈ షో కు సంబంధించిన  రష్మి , సుడిగాలి సుధీర్ వీడియో ప్రోమో  ఆన్‌లైన్‌లో వైరల్ గా మారింది.

సుధీర్‌కు పాఙ‌టివ్ అని తేల‌డంతో `జ‌బ‌ర్ద‌స్త్` బృందం రష్మికి కోవిడ్ న‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో పాజిటివ్ అని రావ‌డంతో ర‌ష్మిగౌత‌మ్ సెల్ఫ్ హోమ్ ఐలోలేష‌న్‌లోకి వెళ్లిపోయింది. డాక్ల‌ర్ల స‌ల‌హాల మేర‌కు జాగ్న‌ర‌త్తలు పాటిస్తూ మెడిసిన్ వాడుతున్న‌ట్టు చెబుతున్నారు.