“రష్మి” కి అందం ఉంది, అభినయం ఉంది కాని ప్రేక్షక దేవుళ్ళ ఆదరణ, కరుణ లేదు.


Rashmi Gautham
“రష్మి” కి అందం ఉంది, అభినయం ఉంది కాని ప్రేక్షక దేవుళ్ళ ఆదరణ, కరుణ లేదు.

ఈ రోజుల్లో బుల్లితెర, పెద్ద తెర అని తేడా ఏం లేదు. చక్రం తిప్పాలి అనుకుంటే ఎలా అయిన, ఎక్కడి నుండి అయిన ప్రయత్నించడం లొ తప్పు లేదు కదా, కాని ఆ ప్రయత్నించే టైం కూడా కొంతమందికి లేకపోవడం, ఉన్న టైం కూడా మంచిగా ఉపయోగించకుండా, ఆ అవకాశాన్ని గాలికి వదిలేసి, కేవలం మాకు డబ్బు ఒస్తే చాలు మేము ఏ పాత్ర ఇచ్చిన చేసేస్తాం అని కొంతమంది కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో.

నిజానికి అస్సలు తెర మీద అందానికి ప్రాధాన్యత లేని వాళ్ళు కూడా సీరియల్స్, సినిమాలు, చిన్న చిన్న మూవీస్ చేసుకుంటూ ఉన్నారు. బుల్లితెర “ఎక్స్ట్రా జబర్దస్త్” యాంకర్ కం హీరోయిన్ “రష్మి గౌతమ్” కి పాపం ఎన్ని సార్లు ప్రయత్ని౦చిన సినిమాల విషయం లో ఇంతవరకి చెప్పుకోతగ్గ సినిమా ఈ అమ్మడు చేతిలో లేదు, ఇప్పటి వరకి హిట్ ఉన్నది అంటే అది ఒక్కటే సినిమా అది కూడా “గుంటూరు టాకీస్” అని అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్ర మాత్రమే.

కాని బుల్లితెర మీద చేస్తూ, సినిమాలు కూడా చేస్తూ విజయాలు అందుకుంటున్నారు చాల మంది. కాని మన రష్మి మాత్రం ప్రయత్నిస్తున్నా కూడా ఫలితం దక్కటం లేదు అని ఆపేసిందో ఏమో. లేదు అస్సలు తను ప్రయత్నిచడం లేదు లేకపోతే తనకి హిట్స్ ఉండేవి అని కొంతమంది అంటున్నారు. అసలు ఎందులో ఏం నిజముందో ఎవరికి తెలుసు? ఈ అమ్మడు సినిమాలు మాత్రం సంవత్సరానికి 2,3 రిలీజ్ అవుతునాయి, థియేటర్ నుండి కూడా 2,3 రోజుల్లో తిరిగి పయనం అయిపోతున్నాయి, ఇలా అయితే కష్టమే ఇంకా!

ప్రయత్నం చేసినా, చేయకపోయినా, ప్రేక్షక దేవుళ్ళ ఆదరణ, కరుణ, మంచి సినిమా కథలు ఈమెని వెతుక్కుంటూ వచ్చి మంచి అనుభూతి తో పాటు సినిమాలు కూడా హిట్ అవ్వాలి అని దేవుడ్ని వేడుకుందాం.

Credit: Twitter