ముంబైలో రౌడీ జోడీ హ‌ల్‌చ‌ల్‌!

ముంబైలో రౌడీ జోడీ హ‌ల్‌చ‌ల్‌!
ముంబైలో రౌడీ జోడీ హ‌ల్‌చ‌ల్‌!

సెన్సేష‌న‌ల్ రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న‌పాన్ ఇండియా మూవీ `లైగ‌ర్`. పూరి జ‌గ‌న్నాథ్ డైరెక్ష‌న్‌లో క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తాల‌తో క‌లిసి చార్మి, పూరి జ‌గ‌న్నాథ్ అ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా షూటింగ్ ఆగిపోయిన ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే ముంబైలో పునః ప్రారంభ‌మైంది.

ద‌ర్శ‌కుడు ఈ మూవీ కోసం అక్క‌డే ఆఫీస్‌ని ఓపెన్ చేసిన విష‌యం తెలిసిందే. చెప్పాలంటే పూరికి, చార్మీకి సెకండ్ హోమ్ టౌన్‌గా ముంబై న‌గ‌రం మారింది. దీంతో షూటింగ్ విరామంలో త‌ర‌చూ టీమ్ అంతా వీకెండ్ పార్టీలో హోరెత్తిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీతో విజ‌య్ దేవ‌ర‌కొండ బాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. దీంతో విజ‌య్ దేవ‌ర‌కోండ అక్క‌డే వుంటున్నారు. ఇదే స‌మ‌యంలో క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న ఇదే ఏడాది బాలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం కాబోతోంది.

సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా హీరోగా న‌టిస్తున్న `మిష‌న్ మ‌జ్ను` సినిమాతో ర‌ష్మిక బాలీవుడ్ కు ప‌రిచ‌యం అవుతోంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో జ‌రుగుతోంది. ఇందు కోసం ఇటీవ‌లే ర‌ష్మిక ముంబై వెళ్లింది. అక్క‌డ షూటింగ్ గ్యాప్ దొర‌క‌డంతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక క‌లిసి ముంబై వీధుల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.