రష్మిక పెద్ద ప్లాన్ తోనే వస్తోందిగా!రష్మిక పెద్ద ప్లాన్ తోనే వస్తోందిగా!
రష్మిక పెద్ద ప్లాన్ తోనే వస్తోందిగా!

రష్మిక మందన్న.. ఛలో సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన రష్మిక ఆనతి కాలంలోనే బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం టాప్ హీరోల సరసన సినిమాలు చేస్తూ టాప్ రేంజ్ కు చేరుకునే క్రమంలో ఉంది. ఈ ఏడాది రష్మిక చేసిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మహేష్ బాబు సరసన చేసిన సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన చేసిన భీష్మ కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఏడాది అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రానికి కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమాతో టాప్ లీగ్ లోకి చేరిపోవడం ఖాయమన్న సంకేతాలు అందుతున్నాయి. కెరీర్ ఇలా సాఫీగా సాగిపోతోన్న సమయంలో రష్మిక ఇచ్చిన ఒక ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది.

సాధారణంగా మీ దగ్గర ఏమైనా కథలు ఉంటే వాటిని మాకు పంపండి అని సినిమా వాళ్ళు అడగడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ప్రకటన అయితే హీరో ఇస్తాడు, లేదా దర్శకుడు ఇస్తాడు. వీళ్ళిద్దరూ కాకపొతే నిర్మాత ఇస్తాడు. కానీ ఒక హీరోయిన్ ఎప్పుడైనా ఇలా ప్రకటన ఇచ్చిందా. అసలు అలాంటి అవసరం కూడా ఇప్పటివరకూ ఏ హీరోయిన్ కు వచ్చి ఉండదు. తన వద్దకు కథలలోనుండి మంచివి ఏరుకుని సినిమా చేస్తారు.

అలాంటిది రష్మిక మీ దగ్గరేమైనా ఆసక్తికర కథలు ఉంటే నాకు మెయిల్ చేయండి అంటూ ఒక మెయిల్ ఐడి కూడా ఇచ్చింది. అయితే తన వద్ద ఉన్న టీమ్ చాలా చిన్నదని సో మీ కథలను రివ్యూ చేయడానికి కొంచెం ఎక్కువ సమయమే పడుతుందని తెలిపింది. రష్మిక ఇచ్చిన ఈ ప్రకటన ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్యంలో పడేసింది. అసలు రష్మికకు అంత అవసరం ఏమొచ్చింది అని అందరూ ఆలోచిస్తున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ కథల కోసం చూస్తోందా? నిర్మాతగా ఏమైనా మారే అవకాశం ఉందా? లేక డైరెక్ట్ గా డైరెక్టర్ అయిపోవాలనుకుంటోందా? అన్నదే ఇప్పుడు అర్ధం కాని ప్రశ్న.