రష్మిక తన కెరీర్ ను నాశనం చేసుకుంటోందా?


Rashmika Mandanna
రష్మిక తన కెరీర్ ను నాశనం చేసుకుంటోందా?

రష్మిక మందన్న.. ప్రస్తుతం తెలుగులో టాప్ ఫామ్ లో ఉన్న హీరోయిన్. ప్రస్తుతం మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ చేస్తోంది. అల్లు అర్జున్ – సుకుమార్ చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. ఇంత బిజీగా ఉండి కూడా రష్మిక ప్రస్తుతం పక్క చూపులు చూస్తోంది.

తెలుగులో ఫుల్ డిమాండ్ ఉన్న సమయంలోనే తమిళంలో బిజీ అవ్వాలన్న తన కోరికను బయటపెట్టింది. ప్రస్తుతం కార్తీ సరసన ఒక సినిమా చేస్తున్న రష్మిక.. విజయ్ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు లాబీయింగ్ మొదలుపెట్టింది. కచ్చితంగా ఈమెకే అవకాశం వచ్చేలా ఉందని సమాచారం. దీంతో పాటు అజిత్ తో కూడా నటించాలని ఉందని తన భావాన్ని వ్యక్తపరిచింది.

ఇందుకోసమే తెలుగులో రామ్ సినిమా అవకాశం వచ్చినా తోసిపుచ్చింది. తన డేట్స్ ఖాళీగా ఉంటే విజయ్, అజిత్ సినిమాలకు కేటాయించొచ్చని ఆమె భావన. మరి ఆమె ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేక రెండిటికి చెడ్డ రేవడిలా తయారవుతుందో చూడాలి.