ర‌ష్మిక మంద‌న్న‌‌కు షాకిచ్చిన గూగుల్!

ర‌ష్మిక మంద‌న్న‌‌కు షాకిచ్చిన గూగుల్!
ర‌ష్మిక మంద‌న్న‌‌కు షాకిచ్చిన గూగుల్!

టాలీవుడ్‌లో కేవ‌లం రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ ఫిల్మ్స్ తో టాప్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది క‌న్న‌డ భామ ర‌ష్మిక మంద‌న్న‌. కన్నడలో `కిర్రాక్ పార్టీ` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ చ‌లాకీ చిన్న‌ది ఆ త‌రువాత తెలుగులో `ఛ‌లో` మూవీతో అరంగేట్రం చేసి స్టార్ నాయిక‌గా స్టార్‌డమ్ ని సొంతం చేసుకుంది.

తెలుగులో గీత గోవిందం, భీష్మ, స‌రి‌లేరు నీకెవ్వ‌రు వంటి వ‌రుస‌ హిట్స్ రావడంతో ప్రస్తుతం తెలుగులో క్రేజీ హీరోయిన్ గా రష్మిక నిలిచింది. విజయ్ దేవరకొండ నటించిన `గీత‌ గోవిందం` చిత్రంతో  బ్లాక్ బ‌స్ట‌ర్  విజయాన్ని సొంతం చేసుకుని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని ఆకర్షించింది. ఈ ఏడాది విడుదలైన `స‌రి‌లేరు నీకెవ్వ‌రు`తో  భారీ బ్లాక్ బస్టర్ ని త‌న ఖాతాలో వేసుకుంది. ఇదిలా వుంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ రష్మిక మంద‌న్నను నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా చూపించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

గూగుల్‌లో ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా 2020’ అని సెర్చ్ చేస్తే రష్మిక ను చూపిస్తోంది. ఇటీవ‌ల రష్మిక ధ‌రించిన కాస్ట్యూమ్స్ సింపుల్‌గా ద గ‌ర్ల్ నెక్ట్ డోర్‌ల వుండ‌టంతో ఆమెని దేశ వ్యాప్తంగా నెటిజ‌న్స్ ఇష్ట‌ప‌డుతున్నార‌ట‌. రష్మిక హిందీలో ఏ మూవీ చేయ‌క‌పోయినా ఆమె న‌టించిన భీష్మ‌, గీత గోవిందం, స‌రి‌లేరు నీకెవ్వ‌రు, ఛ‌లో చిత్రాలు హిందీలోనూ డ‌బ్ కావ‌డంతో ర‌ష్మ‌క‌కు దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పెరిగిందని ఆ కార‌ణంగానే ఆమెని గూగుల్ నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా గా చూపిస్తోంద‌ని చెబుతున్నారు.