రష్మిక కు ఫిదా అయిపోయిన టాలీవుడ్


రష్మిక కు ఫిదా అయిపోయిన టాలీవుడ్
రష్మిక కు ఫిదా అయిపోయిన టాలీవుడ్

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయిన రష్మిక మందన్న అనతికాలంలోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె చేతి నిండా సినిమాలతో టాలీవుడ్ లో బిజీ బిజీగా కాలం గడిపేస్తోంది. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ సరసన ఎంపికవ్వడంతో ఆమె టాప్ లీగ్ లో చేరినట్లయింది. వెంటనే ఆమెకు అల్లు అర్జున్ – సుకుమార్ చిత్రంలో అవకాశం కూడా వచ్చింది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ మొదలుకానుంది.

ఇక తనకు తెలుగులో తొలి సినిమా అవకాశమిచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీష్మ చిత్రంలో ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక. ఇవే కాకుండా దిల్ రాజు నిర్మాణంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కనున్న అదే నువ్వు అదే నేను చిత్రంలో కూడా రష్మికనే హీరోయిన్ గా ఎంచుకున్నారు. సమంత తర్వాత టాప్ హీరోయిన్ స్థానానికి ఏర్పడిన ఖాళీని పూడ్చాలనుకుంటోంది రష్మిక. మరి ఈ సినిమాలన్నీ హిట్ అయితే ఆమె టాప్ ప్లేస్ కు చేరుకోవడం ఖాయమే.