అల్లు అర్జున్‌ని మాస్ట‌ర్ పీస్ అనేసింది! 

Rashmika called allu arjun as a masterpiece
Rashmika called allu arjun as a masterpiece

ర‌ష్మిక.. తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్‌. వ‌రుస హిట్ల‌తో తెలుగులో మంచి మార్కెట్‌ని సొంతం చేసుకుంది. క్రేజీ ఆఫ‌ర్ల‌తో టాప్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయిన ర‌ష్మిక తాజాగా మ‌హేష్‌తో క‌లిసి `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో న‌టించిన విష‌యం తెలిసిందే. సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

ఈ సంద‌ర్బంగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ భాష‌ల్లో క‌లిపి 13 చిత్రాల్లో న‌టించిన ఈ క‌న్న‌డ సోయ‌గం దాదాపు 12 మంది హీరోల‌తో క‌లిసి ప‌నిచేసింది. ఈ సంద‌ర్భంగా త‌న‌తో క‌లిసి ప‌నిచేసిన హీరోల గురించి మాట్లాడుతూ ర‌క్షిత్ శెట్టి ల‌వ్‌లీ గై అని చెప్పేసింది. మ‌హేష్ సూప‌ర్‌స్టార్ అని, ధృవ స‌ర్జా స్వీట్ ప‌ర్స‌న్ అని నితిన్ ఫుల్ చిల్ గై అని వెల్ల‌డించింది.

కార్తి హంబుల్ అని చెప్పిన ర‌ష్మిక విజ‌య్‌ని ఎక్స్‌ట్రీమ్‌లీ స్మార్ట్ అనేసింది. బ‌న్నీని మాత్రం మాస్ట‌ర్ పీస్ అంటూ స్పెష‌ల్‌గా మెన్ష‌న్ చేయ‌డం బ‌న్నీ ఫ్యాన్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. సుకుమార్ తెర‌కెక్కిస్తున్న చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా ర‌ష్మిక న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా తాజా షెడ్యూల్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది.