నా సినిమాలకే ఇలా ఎందుకవుతోందో తెలియడంలేదంటున్న రష్మికRashmika clarifies about gap in his career
Rashmika clarifies about gap in his career

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తన కెరీర్ లో చేసినవి తక్కువ చిత్రాలే అయినా చాలా తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టే అవకాశాన్ని సంపాదించింది. ఈ చిత్రం రేపు భారీ ఎత్తున విడుదలవుతోంది. అలాగే రష్మిక నటించిన మరో చిత్రం భీష్మ ఫిబ్రవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇలా రెండు సినిమాలు వెంటవెంటనే విడుదల కావడం పట్ల మీ స్పందనేంటి అని రష్మికను అడిగితే అదేంటో అర్ధం కాదు. నాకెప్పుడూ ఇలాగే జరుగుతుంది. నా సినిమాలు ఎక్కువగా రెండు, మూడు ఒకేసారి విడుదలైనవి. రెండు నెలల గ్యాప్ లో ఇలా సినిమాలు విడుదల కావడం వల్ల ఆ ఏడాదంతా నేను చాలా ఖాళిగా సినిమాలేం లేకుండా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ నేను ఏడాదంతా కష్టపడి చేసిన షూటింగ్స్ సంగతి మర్చిపోతారు.

ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయి. అయినా 2019 డియర్ కామ్రేడ్ ఒక్కటే చేసావేంటని అడిగేస్తుంటారు కానీ నేను నటించిన ఈ రెండు సినిమాల గురించి పట్టించుకోరు. అలాగే రిపీట్ అవుతోంది. నా సినిమాల విషయంలోనే ఎందుకిలా అవుతుందో నాకు అర్ధం కాదు అంటోంది రష్మిక. సినిమాలో నటించడం వరకే నా పని, రిలీజ్ డేట్స్ విషయంలో నా ప్రమేయం ఉండదు కదా అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలు విడుదలయ్యాక అమ్మడు చేతిలో అల్లు అర్జున్ – సుకుమార్ సినిమా ఒకటే చేతిలో ఉంటుంది. మరే సినిమా ఒప్పుకోలేదు. ఈ రెండు సినిమాల ఫలితాల్ని బట్టి తెలుగులో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని అనుకుంటోంది. బన్నీ సినిమా కాకుండా తమిళంలో ఒక సినిమా, కన్నడలో ఒక సినిమాలో నటిస్తోంది రష్మిక.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో హీరోని విసిగించే ఒక చలాకీ అమ్మాయి పాత్రలో ఈమె నటించినట్లు సమాచారం. డ్యాన్సుల్లో కూడా ఎక్కువ స్కోపే ఉంది. ఇప్పటికే రష్మిక చేసిన హీ ఈజ్ సో క్యూట్ సాంగ్ స్టెప్ బాగా వైరల్ అయిన విషయం తెల్సిందే.