అభిమానికి ర‌ష్మిక దిమ్మ‌దిరిగే రిప్లై‌!


అభిమానికి ర‌ష్మిక దిమ్మ‌దిరిగే రిప్లై‌!
అభిమానికి ర‌ష్మిక దిమ్మ‌దిరిగే రిప్లై‌!

టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారింది క‌న్న‌డ క‌స్తూరి ర‌ష్మిక మంద‌న్న‌. కేవ‌లం ఆరు చిత్రాల‌తో మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. `ఛ‌లో` సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. తొలి హిట్‌తో ఇండ‌స్ట్రీ దృష్టిని ఆక‌ర్షించింది. ఆ త‌రువాత `గీత గోవిందం`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని ఖాతాలో వేసుకుంది. `డియ‌ర్ కామ్రేడ్‌`, దేవ‌దాస్‌` ప‌ర‌వాలేద‌నిపించినా స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ చిత్రాలు భారీ విజ‌యాల్ని సాధించాయి.

ప్ర‌స్తుతం ర‌ష్మిక `పుష్ప‌` చిత్రంలో న‌టిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ర‌ష్మిక గ్రామీణ యువ‌తిగా చిత్తూరు అమ్మాయిగా క‌నిపించ‌బోతోంది. అల్లు అర్జున్  లారీ డ్రైవ‌ర్‌గా ఊర‌మాస్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ న‌డుస్తున్న సంద‌ర్భంగా ఇంటికే ప‌రిమిత‌మైన ర‌ష్మిక సోష‌ల్ మీడియా వేదిక‌గా ఫ్యాన్స్‌తో ముచ్చింది.

అభిమానులు అడిన ప్ర‌శ్న‌ల‌కు చిలిపి స‌మాధానాలు చెప్పింది. శారుఖ్, కాజ‌ల్ త‌రహాలో నాతో డేటింగ్ చేస్తారా అని అడిగితే త‌న‌ని కొంచెం ఆలోచించుకునే అవ‌కాశం ఇమ్మ‌ని రిప్లై ఇచ్చింది. దేవుడు ఎదురైతే నీకు భ‌ర్త‌ని చేయ‌మ‌ని అడుగుతాన‌ని ఓ అభిమాని అతిగా ఆశ‌ప‌డితే ర‌ష్మిక నుంచి దిమ్మ‌దిరిగే రిప్లై వ‌‌చ్చింది. త‌న పెళ్లి గురించి అడ‌గాలంటే ముందు త‌న పెంపుడు కుక్క‌ని అడ‌గాల‌ని స‌మాధానం చెప్ప‌డంతో స‌ద‌రు అభిమాని షాక‌య్యాడు.