ఐటీ రైడ్స్ ఆ హీరోయిన్ కోసం కాదా?


Rashmika manager say all false statements
Rashmika manager say all false statements

తెలుగులో క్రేజీ క‌థానాయిక‌గా వ‌రుస ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటోంది ర‌ష్మిక మంద‌న్న‌. ఇటీవ‌ల సంక్రాంతి రిలీజైన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని త‌న ఖాతాలో వేసుకుంది. తాజాగా బెంగ‌ళూరులోని కొడుగు జిల్లా విరాజ్‌పేట్‌లో వున్న‌ర‌ష్మిక ఇంటిలో ఐటీ అధికారులు ఇటీవ‌ల ఆక‌స్మికంగా త‌న‌ఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 25 ల‌క్ష‌ల న‌గ‌దుతో పాటు ప‌లు కీల‌క ప‌త్రాల్ని అధికారులు స్వాధినం చేసుకున్నార‌ట‌.

ర‌ష్మిక త‌న క్రేజ్‌కు త‌గ్గ‌ట్టు పారితోషికాల్ని తీసుకుంటూ ఐటీ మాత్రం స‌జావుగా క‌ట్ట‌డం లేద‌ని, ఐటీలో త‌న పారితోషికాల్ని త‌క్కువ‌గా చేసి చూపిస్తోంద‌ని, ఆ కార‌ణంగానే ఐటీ అధికారుల క‌న్ను ర‌ష్మిక ఇంటిపై ప‌డింద‌ని ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి. అయితే అస‌లు ఐటీ రైడ్ జ‌రిగింది ర‌ష్మిక పై కాద‌ని, ఆమె తండ్రిపై అని తాజాగా ఆమె మేనేజ‌ర్ వెల్ల‌డించ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ర‌ష్మిక మాత్రం ఈ వివాదంపై నేరుగా కానీ, సోష‌ల్ మీడియా వేదిక‌గా కానీ స్పందించ‌లేదు. ర‌ష్మిక మద‌ర్ మాత్రం త‌మ ఇంట్లో ఐటీ సోదాలు జ‌రిగిన మాట వాస్త‌మేన‌ని, అధికారులు కొన్ని ప్ర‌శ్నలు వేశార‌ని, వారికి త‌మ కుటుంబం స‌హ‌క‌రిస్తోందిన వెల్ల‌డించింది. దీంతో రష్మిక‌ మేనేజ‌ర్ చెప్పిన మాట‌లు అబ‌ద్ధం అని తెలుస్తోంది. ఐటీ దాడులు జ‌రిగింది ర‌ష్మిక కోస‌మే న‌ని, కావాల‌నే ఆమె మేనేజ‌ర్ త‌ప్పుడు స‌మాచారం ఇస్తున్నార‌ని మీడియాలో వినిపిస్తోంది.