`ఆర్‌సీ15`లో ర‌ష్మిక పాత్ర అదేనా?

`ఆర్‌సీ15`లో ర‌ష్మిక పాత్ర అదేనా?
`ఆర్‌సీ15`లో ర‌ష్మిక పాత్ర అదేనా?

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో క‌లిసి న‌టిస్తున్న చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. ఈ భారీ చిత్రాన్ని అక్టోబ‌ర్ 13న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రి‌లీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత రామ్‌చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా దిగ్రేట్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా మూవీ తెర‌కెక్క‌నున్న విష‌యం తెలిసిందే.

ఇది రామ్‌చ‌ర‌ణ్ న‌టించ‌నున్న 15వ చిత్రం. అందుకే ఈ చిత్రానికి వ‌ర్కింగ్ టైటిల్‌గా `ఆర్‌సీ15` అని పెట్టారు. ఈ మూవీని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు, శిరీష్ ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. ఇటీవ‌లే ప్ర‌క‌టించిన ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్ట్‌లో క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించ‌నుంద‌ని తెలిసింది. ఇక ఇందులో ర‌ష్మిక జ‌ర్న‌లిస్టుగా క‌నిపించే అవ‌కాశం వుంద‌ని తాజా స‌మాచారం.

ఇటీవ‌లే ర‌ష్మిక‌కు శంకర్ క‌థ వినిపించార‌ని, వెంట‌నే ఆమె ఈ ప్రాజెక్ట్‌లో న‌టిస్తాన‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు, జూలై 15 నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌బోతోంద‌ని తెలిసింది. స‌మ‌కాలీన రాజ‌కీయాల నేప‌థ్యంలో రూపొంద‌నున్న ఈ మూవీలో రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య‌మంత్రిగా క‌న‌పిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, స‌ల్మాన్‌ఖాన్ కీల‌క అతిథి పాత్ర‌ల్లో క‌నిపిస్తార‌ని కూడా ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.