“కన్నడ లూస్ పొన్ను” – రష్మిక బర్త్ డే స్పెషల్


“కన్నడ లూస్ పొన్ను” – రష్మిక బర్త్ డే స్పెషల్
“కన్నడ లూస్ పొన్ను” – రష్మిక బర్త్ డే స్పెషల్

ఫస్ట్ సినిమా “కిరిక్ పార్టీ” లో శాన్వి గా అందర్నీఆకట్టుకుంది. ఆ సినిమాతోనే  ఉత్తమ తొలి చిత్ర నటిగా సైమా అవార్డు గెలుచుకోవడంతో పాటు; ఐఫా అవార్డ్స్ కు కూడా నామినేట్ చేయబడింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. మొదట్లో క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ వాష్ అడ్వర్టైజ్మెంట్ మోడల్ గా పనిచేసిన రష్మిక మందన్న ఎప్పుడైతే కిరిక్ పార్టీ టీం కంటపడిందో.. ఆమె లైఫ్ టర్న్ అయింది. ఆ వెంటనే కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ సరసన “అంజనీపుత్ర” అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. తమిళంలో ఆ సినిమాను “పూజ” అనే పేరుతో రీమేక్ చేశారు. ఇక  ఆ వెంటనే “చమక్” అనే కన్నడ సినిమాలో కూడా ఖుషి అనే పాత్రలో కనిపించి హ్యాట్రిక్ హీరోయిన్ అనిపించుకుంది రష్మిక.తన మొదటి హిట్ ఫెయిర్ అయిన హీరో కమ్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి తో నిశ్చితార్థం చేసుకుని.. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల పెళ్లి రద్దు చేసుకుంది రష్మిక.

యాదృచ్ఛికమో.. కాకతాళీయమో.. తెలియదు కానీ, ఇటీవల రక్షిత్ శెట్టి హీరోగా చేసిన పాన్ ఇండియా సూపర్ హిట్ సినిమా “అవనే శ్రీమన్నారాయణ” సినిమాలో కూడా హీరోయిన్ పేరు శాన్వి కావడం గమనార్హం. తెలుగులో డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన “చలో” సినిమాలో నాగ శౌర్య కాంబినేషన్ లో కార్తీక అనేక క్యారెక్టర్ లో నటించింది రష్మిక.

గీత ఆర్ట్స్ బ్యానర్ పై పరశురామ్ బుజ్జి దర్శకత్వంలో వచ్చిన “గీత గోవిందం” సినిమాలో గీత పాత్రలో నటించి టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది రష్మిక. ఆ తర్వాత నాని మరియు నాగార్జున నటించిన మల్టీ స్టారర్ సినిమా “దేవదాసు” లో పూజ అనే క్యారెక్టర్ లో నటించింది. సినిమా అంతగా విజయం సాధించలేదు. తర్వాత వచ్చిన “డియర్ కామ్రేడ్” సినిమా ఘోర పరాజయం పాలైంది. సంక్రాంతికి విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా “సరిలేరు నీకెవ్వరు” లో సంస్కృతి అనే పాత్రలో కనిపించింది రష్మిక. ఇక టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ సరసన భీష్మ అనే సినిమాలో నటించింది. సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా తన యొక్క మాటతీరు ఆటిట్యూడ్ తో కూడా ఇంకా బాగా పాపులర్ అయింది రష్మిక. ఇక తాజాగా సోషల్ మీడియాలో “రష్మికపెడిగ్రీ కుక్క బిస్కెట్స్ తింటుంది….!” అంటూ  భారీగా ట్రోల్ చేస్తున్నారు.

రష్మిక భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు చెయ్యాలని కోరుకుందాం.