దేవదాస్ లో నటించి తప్పు చేసిన రష్మీక


Rashmika mandanna blunder mistake with devadas

అక్కినేని నాగార్జున , నాని లాంటి స్టార్ హీరోలు నటిస్తున్న సినిమా కదా అని ముందు వెనుకా ఆలోచించకుండా దేవదాస్ సినిమా ఒప్పుకొని కొని తప్పుచేసింది రష్మీక మందన్న . ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ రష్మీక , ఛలో సూపర్ హిట్ కావడంతో వెంటనే గీత గోవిందం చిత్రంలో ఛాన్స్ వచ్చింది దాంతో ఆ సినిమా చేసింది . మంచి పాత్ర లభించడంతో తన నటనని ప్రదర్శించే ఛాన్స్ లభించింది. ఇక గీత గోవిందం విడుదల కాకముందే మళ్లీ విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది . కట్ చేస్తే గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయి రష్మీక మందన్న కు స్టార్ డం ని తెచ్చిపెట్టింది. అయితే దేవదాస్ మాత్రం దెబ్బకొట్టింది రష్మీక ని .

నాగార్జున , నాని లాంటి స్టార్ లు నటిస్తున్న సినిమా కావడంతో కథ , కథనం గురించి పట్టించుకోకపోవడంతో ఫలితం దారుణంగా దెబ్బకొట్టింది. దేవదాస్ సెప్టెంబర్ 27న విడుదల అయ్యింది అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. దాంతో దేవదాస్ ప్లాప్ బారిన పడినట్లే ! ఛలో , గీత గోవిందం చిత్రాలతో వరుస విజయాలు సాధించిన రష్మీక మందన్న కు దేవదాస్ చిత్రం వల్ల హ్యాట్రిక్ మిస్ అయ్యింది. స్టార్ హీరోలు అని తొందరపడి చేసి తప్పు చేసింది రష్మీక మందన్న .

English Title: Rashmika mandanna blunder mistake with  devadas