రష్మిక మందన్న డబ్బింగ్ సినిమా రెడీ


ఛలో , గీత గోవిందం చిత్రాలతో తెలుగునాట క్రేజ్ సంపాదించుకుంది రష్మిక మందన్న . దాంతో ఈ భామకు తెలుగునాట మంచి డిమాండ్ ఏర్పడటంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి రష్మిక మందన్న నటించిన కన్నడ చిత్రాన్ని తెలుగులో ” గీతా ఛలో వీకెండ్ ” అంటూ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . వీకెండ్ పేరిట అమ్మాయిలు – అబ్బాయిలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు , అలా బానిసలుగా మారి వాళ్ళ జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అన్న సందేశంతో” గీతా ఛలో ” అనే చిత్రాన్ని రూపొందించారు .

రష్మిక మందన్న గ్లామర్ తో అలరించింది కాబట్టి కుర్రాళ్ళు రష్మిక అందాల కోసం ఎగబడటం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం . ఈనెల 26 న గీతా ఛలో చిత్రం రిలీజ్ కానుంది . ప్రస్తుతం ఈ భామ డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తోంది . విజయ్ దేవరకొండ హీరో దాంతో డియర్ కామ్రేడ్ చిత్రంపై కూడా అంచనాలు పెరిగాయి .