ఇష్టమైన నటిగా ఉండాల‌ని లేద‌ట‌!


ఇష్టమైన నటిగా ఉండాల‌ని లేద‌ట‌!
ఇష్టమైన నటిగా ఉండాల‌ని లేద‌ట‌!

తెలుగు, క‌న్న‌డ భాష‌ల్లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపుని సొంతం చేసుకుంది. వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో టాప్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. ల‌క్ష‌ల్లో అభిమానుల్ని సొంతం చేసుకుంది. సోష‌ల్ మీడియాలో ఆమె ఫాలోవ‌ర్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌స్తుతం కార్తీతో `సుల్తాన్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఇక తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్ గా చెప్పుకుంటున్న‌ప `పుష్ప‌` చిత్రంలో బ‌న్నీకి జోడీగా క‌నిపించ‌బోతోంది. ప‌క్కా గ్రామీణ యువ‌తిగా ఇందులో ర‌ష్మిక క‌నిపించ‌బోతోంది.

ఈ మూవీ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానున్న వేళ మాంచి జోష్‌తో వుండాల్సిన ర‌ష్మిక ఎమోష‌న‌ల్ కావ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌ని షేర్ చేసింది. తాను అభిమాన న‌టిగా ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌టం లేద‌ని, తాను ఓ ఫ్యామిలీ మెంబ‌ర్‌లా వుండాల‌నుకుంటున్నాన‌ని ఎమోష‌న‌ల్ అయ్యింది. ప్ర‌తీదీ త‌న‌కు ఎందుకు వ‌స్తుందో తెలియ‌దు. ఏది వ‌చ్చినా చిరున‌వ్వుతో దాన్ని ఆహ్వానిస్తాను. ప్ర‌తీ ఒక్క‌రూ మంచిగా లేదా చెడుగా వుండండి అయితే ఆ విష‌యంలో నిజాయితీగా వుండండి అంటోంది.

ఎవ‌రైనా బాధ‌లో వుంటే త‌ట్టుకోలేను  వెంట‌నే నా ముఖం బాధ‌తో మారిపోతుంది. అయితే ఆ బాధ‌ని క‌నిపించ‌కుండా మీ ముందు చిరున‌వ్వుతో క‌నిపించాల‌నుకుంటాను. నా కోసం ఎవ‌రు ఇబ్బందిప‌డ‌కూడ‌ద‌నుకుంటాను. చిరున‌వ్వుతో వుండాల‌నుకుంటాను. మీరు ప్ర‌శాంతంగా వుండాల‌నుకుంటాను. నేను మీ మీద ఆధారపడినంత మాత్రాన మీరు నాపై ఆధారపడాలని నేను కోరుకుంటున్నాను .. నేను మీకు ఇష్టమైన నటిగా ఉండటానికి ఇష్టపడను .. నేను మీ కుటుంబంగా ఉండాలనుకుంటున్నాను. అదే నేను ఇక్క‌డ మీకు చెప్పాల‌నుకున్నాను` అని పోస్ట్ చేసింది.