విజయ్ దేవరకొండ సొంత బ్యానర్ లో రష్మిక ?


Rashmika Mandanna
Rashmika Mandanna

విజయ్ దేవరకొండ తన సొంత బ్యానర్ ని స్థాపించిన విషయం తెలిసిందే . కింగ్ ఆఫ్ ద హిల్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ ని స్టార్ట్ చేసాడు ఈ క్రేజీ హీరో . ఆ బ్యానర్ పై దాస్యం తరుణ్ భాస్కర్ ని హీరోగా పెట్టి ఓ సినిమా తీస్తున్న విషయం కూడా తెలిసిందే . కాగా తన తదుపరి చిత్రంలో తనకు బాగా అచ్చొచ్చిన హీరోయిన్ రష్మిక మందన్న తో ఓ సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నాడట విజయ్ దేవరకొండ.

దాంతో రష్మిక మందన్న డేట్స్ కూడా తీసుకున్నాడట , విజయ్ దేవరకొండ అడగడం రష్మిక మందన్న కాదనకపోవడం ఉంటుందా ? అందుకే అడగ్గానే వెంటనే డేట్స్ ఇచ్చేయడానికి సిద్దమైందట . ఇంతకుముందు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న గీత గోవిందం చిత్రంలో నటించగా అది సూపర్ హిట్ అయ్యింది , ఇక ఇప్పుడేమో డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తున్నారు . డియర్ కామ్రేడ్ జూలై 26 న విడుదల కానుంది .