అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్న ర‌ష్మిక‌!


అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్న ర‌ష్మిక‌!
అల్లు అర్జున్‌ని ఫాలో అవుతున్న ర‌ష్మిక‌!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఊర మాస్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ యెర్నేని,  ర‌విశంక‌ర్‌, సీవీ మోహ‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే తొలి షెడ్యూల్ పూర్త‌యింది. కీల‌క షెడ్యూల్‌ని కేర‌ళ అడ‌వుల్లో ప్రారంభించాల‌ని ప్లాన్ చేశారు. కానీ క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డింది.

ఈ చిత్రంలో కెరీర్‌లోనే తొలిసారి అల్లు అర్జున్ ఊర మాస్ పాత్ర‌లో లారీ డ్రైవ‌ర్‌గా పుష్ప‌రాజ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. శేషాచ‌లం అడ‌వుల్లో గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. య‌బ‌న్నీ తొలి సారి ఈ చిత్రం కోసం చిత్తూరు యాస‌లో మాట్లాడ‌బోతున్నారు. హీరోయిన్‌గా రాయ‌ల‌సీమ గ్రామీణ యువ‌తిగా న‌టిస్తున్న ర‌ష్మిక కూడా ఈ చిత్రం కోసం చిత్తూరు భాష‌ని నేర్చుకుంటోంద‌ట‌.

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం లాక్‌డౌన్‌ని మే 3 వ‌ర‌కు పొడిగించిన విష‌యం తెలిసిందే. దీని కార‌ణంగానే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ వాయిదా ప‌డింది. దీంతో ర‌ష్మిక‌కు స‌మ‌యం క‌లిసి వ‌స్తోంద‌ట‌. చిత్తూరు యాస‌పై ప‌ట్టు సాధించ‌డం కోసం ర‌ష్మిక‌కు నెలకు మించి స‌మ‌యం చిక్క‌డంతో ప్ర‌స్తుతం ఆ యాస‌ని ప‌ట్టేసే ప‌నిలో క‌స‌ర‌త్తులు చేస్తోంద‌ట‌.  తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ‌