`ఆడవాళ్లు మీకు జోహార్లు` ర‌ష్మిక ఫ‌స్ట్‌లుక్‌!

`ఆడవాళ్లు మీకు జోహార్లు` ర‌ష్మిక ఫ‌స్ట్‌లుక్‌!
`ఆడవాళ్లు మీకు జోహార్లు` ర‌ష్మిక ఫ‌స్ట్‌లుక్‌!

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తున్న చిత్రం `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.  క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది.  ఎస్‌.ఎల్‌.వి సినిమాస్ బ్యాన‌ర్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే ఈ చిత్ర టైటిల్‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన చిత్ర బృందం తాజాగా హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఆమెకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేశారు.

శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌, కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో రూపొందుతున్నతొలి చిత్ర‌మిది. పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ర‌ష్మిక ఎల్లో క‌ల‌ర్ సారీ క‌ట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తూ బంతిపూల మాల క‌డుతున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో వున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కాబోతోంది.

ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే నిర్మాత వెల్ల‌డించ‌నున్నారు. ర‌ష్మిక ప్ర‌స్తుతం `పుష్ప‌` మూవీతో పాటు బాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేస్తూ బిజీగా వుంది. ఈ పుట్టిన రోజున వ‌రుస షూటింగ్‌ల‌లో పాల్గొంటూ బిజీగా వుంది.