ర‌ష్మి లుక్ టెస్ట్‌ ఫినిష్ చేసిన సుక్కు!


ర‌ష్మి లుక్ టెస్ట్‌ ఫినిష్ చేసిన సుక్కు!
ర‌ష్మి లుక్ టెస్ట్‌ ఫినిష్ చేసిన సుక్కు!

`అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న బ‌న్నీ నెక్ట్స్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ యాక్ష‌న థ్రిల్ల‌ర్‌ని చేయ‌బోతున్న విషం తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌లు న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్‌, సి.వి. మోహ‌న్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన తొలి షెడ్యూల్ ఇటీవ‌లే పూర్త‌యింది.

రెండ‌వ షెడ్యూల్‌ని ఈ నెల 13 నుంచి కేర‌ళ అడ‌వుల్లో మొద‌లుపెట్ట‌బోతున్నార‌ని తెలిసింది. ఈ షెడ్యూల్ నుంచి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఎంట‌ర్‌కాబోతున్నారు. ఇందులో హీరోయిన్‌గా బ‌న్నీకి జోడీగా ర‌ష్మ‌క మంద‌న్న న‌టిస్తోంది. ఆమె పాత్ర చిత్ర‌ణ ఈ చిత్రంలో చాలా కొత్త‌గా వుంటుంద‌ని, ప‌క్కా గ్రామీణ యువ‌తిగా ర‌ఫ్మిక పాత్ర వుంటుంద‌ని తెలిసింది. `రంగ‌స్థ‌లం`లో స‌మంత పాత్ర‌ని రామ‌ల‌క్ష్మిగా అందంగా మ‌లిచిన సుకుమార్ ఈ చిత్రం కోసం ర‌ష్మ‌క పాత్ర‌ని కూడా అదే త‌ర‌హాలో తీర్చి దిద్దార‌ట‌.

ఇందు కోసం ఇటీవ‌లే ర‌ష్మ‌క‌పై లుక్ టెస్ట్‌ని నిర్వ‌హించార‌ట‌. లోక‌ల్ చిత్తుర్ అమ్మాయిగా రష్మ‌క ఎలా వుంటుందో లుక్ టెస్ట్ చేసిన సుక్కు ఫైనల్ లుక్‌ను ఖ‌రారు చేసిన‌ట్టు తెలిసింది. శేషాచ‌లం ఫారెస్ట్ నేప‌థ్యంలో గంధ‌పు చెక్క‌ల స్మ‌గ్లింగ్ ఆధారంగా ఈ చిత్రాన్ని కొత్త పంథాలో సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ నెలాఖ‌రు నుంచి కానీ ఈ నెల 13 నుంచి కానీ అల్లు అర్జున్ షూట్‌లో పాల్గొంటార‌ట‌.