ముంబైలో కొత్త ఫ్లాట్ కు షిఫ్ట్ అయిన రష్మిక

ముంబైలో కొత్త ఫ్లాట్ కు షిఫ్ట్ అయిన రష్మిక
ముంబైలో కొత్త ఫ్లాట్ కు షిఫ్ట్ అయిన రష్మిక

టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే టాప్ రేంజ్ కు చేరుకున్న రష్మిక మందన్న ఇప్పుడు వేరే భాషలపై దృష్టి పెట్టింది. ఇటీవలే తమిళ్ డెబ్యూ చేసిన రష్మిక ఇప్పుడు హిందీలో నటిస్తోంది. ఆమె తోలి సినిమా మిషన్ మజ్ను ఇటీవలే మొదలైంది. దీంతో పాటు అమితాబ్ బచ్చన్ సరసన గుడ్ బై సినిమాలో కూడా నటిస్తోంది ఈ అమ్మడు.

ఈ నేపథ్యంలో ముంబైలో ఒక ఫ్లాట్ ను తీసుకుంది రష్మిక. నిన్న ఆ ఫ్లాట్ కు షిఫ్ట్ అయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. “ఈరోజు చాలా జరిగింది. కొత్త ఇంట్లోకి మారాను. చాలా కొనాల్సి వచ్చింది. నా సహాయకుడు నాకు చాలా హెల్ప్ చేసాడు. ఔరా ఈరోజంతా బయటే ఉంది. మొత్తానికి నేను, ఔరా ఈరోజు చాలా అలిసిపోయాం” అని పోస్ట్ చేసింది.

ఔరా అంటే రష్మిక పెంపుడు కుక్క. ఇక తెలుగులో పుష్ప, ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమాకు కమిటైంది రష్మిక మందన్న.