కామ్రేడ్ నా ఫ్రెండ్ మాత్రమే అంటున్న రష్మిక


Rashmika Mandanna And Vijay Devarakonda
Rashmika Mandanna And Vijay Devarakonda

విజయ్ దేవరకొండ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు అంటూ వివరణ ఇచ్చింది రష్మిక మందన్న . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల కాంబినేషన్ లో ” గీత గోవిందం ” , ” డియర్ కామ్రేడ్ ” చిత్రాలు రావడంతో ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు అని వార్తలు వచ్చాయి . అయితే ఈ వార్తలు విజయ్ దేవరకొండ చెవిన అలాగే రష్మిక చెవిన పడ్డాయి దాంతో వివరణ ఇచ్చింది రష్మిక మందన్న .

విజయ్ దేవరకొండ నాకు ఫ్రెండ్ మాత్రమే అంతేకాని అందరూ అనుకుంటున్నట్లుగా ప్రేమ దోమా ఏమి లేదని తేల్చి చెప్పేసింది . ఇప్పటికే రెండు సినిమాలు చేసిన ఈ జంట మూడోసారి కూడా జంటగా నటించనున్నట్లు తెలుస్తోంది . అయితే దానికి సంబందించిన వివరాలు తెలియాల్సి ఉంది . ఇక మూడోసారి కూడా ఈ ఇద్దరూ జతకడితే ఇంకేమైనా ఉందా ? ఇక పెళ్లి చేసేస్తారు మరి . గీత గోవిందం సూపర్ హిట్ కాగా డియర్ కామ్రేడ్ డిజాస్టర్ అయ్యింది .