ప‌ద‌హారు క‌థల్ని రిజెక్ట్ చేసింద‌ట‌!


ప‌ద‌హారు క‌థల్ని రిజెక్ట్ చేసింద‌ట‌!
ప‌ద‌హారు క‌థల్ని రిజెక్ట్ చేసింద‌ట‌!

క్రేజీ క‌థానాయిక‌ల్లో ఏ క‌థ అంద‌లమెక్కిస్తుందో ఏది పాతాళానికి తొక్కేస్తుందో తెలిసిపోతోంది. ఆ జ‌డ్జిమెంట్ వున్న వాళ్లే ఇండ‌స్ట్రీలో ఎక్కువ కాలం కెరీర్‌ని కొన‌సాగిస్తున్నారు. అది లేని వాళ్లు మాత్రం ఒక‌టి రెండు సినిమాల‌తోనే ఇంటి దారి ప‌ట్టేస్తున్నారు. క‌న్న‌డ సుంద‌రి ర‌ష్మిక మంద‌న్న‌కు ఆ టాలెంట్ బాగానే వుంద‌ట‌. `ఛ‌లో` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైందీ క‌న్న‌డ క‌స్తూరి. రెండేళ్ల వ్య‌వ‌ధిలోనే తెలుగులో క్రేజీ క‌థానాయిక‌ల స‌ర‌స‌న చేరిపోయింది.

ఛ‌లో, గీత గోవిందం, డియ‌ర్ కామ్రేడ్‌, స‌రిలేరు నీకెవ్వ‌రు వంటి క్రేజీ చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డి చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్ట్‌లున్నాయి. తెలుగులో రెండు, తమిళంలో ఒక‌టి. తెలుగులో నితిన్ హీరోగా న‌టిస్తున్న `భీష్మ` ఒక‌టి. సుక్కు, బ‌న్నీల క‌ల‌య‌కలో సెట్స్‌పైకి రాబోతున్న సినిమా మ‌రొక‌టి. త‌మిళంలో కార్తి హీరోగా న‌టిస్తున్న `సుల్తాన్‌` చిత్రంలో న‌టిస్తోంది. ఇది ర‌ష్మిక తొలి త‌మిళ చిత్రం. నితిన్‌తో న‌టించిన `భీష్మ‌` ముందుగా అంటే ఈ నెల 21న రిలీజ్ కాబోతోంది.

ఈ సంద‌ర్భంగా మీడియా ముందుకొచ్చిన ర‌ష్మిక ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించింది. నితిన్ కూల్ గ‌య్ అని, ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెబుతున్న‌ప్పుడే న‌వ్వులు ఆపుకోలేక‌పోయాయ‌న‌ని, థియేట‌ర్లో ప్రేక్ష‌కులు పొట్ట చెక్క‌ల‌య్యేలా న‌వ్వుతార‌ని వెల్ల‌డించింది. అల్లు అర్జున్ చిత్రంలో కొత్త ర‌ష్మిక‌ని చూస్తార‌ని. ఈ చిత్రం వ‌చ్చేనెల మొద‌టి వారం నుంచి ప్రారంభం కాబోతోందని, ఈ రెండేళ్ల కాలంలో మొత్తం 16 క‌థ‌ల్ని రిజెక్ట్ చేశాన‌ని షాకిచ్చింది.