ఆ విషయంలో మాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది రష్మిక

Rashmika mandanna reveals her favourite movie
Rashmika mandanna reveals her favourite movie

హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా దూసుకుపోతోంది. చేసిన అన్ని భాషల్లో కూడా రష్మిక మందన్న టాప్ స్థాయికి చేరుకుంటోంది. తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది రష్మిక. అందులో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ప చిత్రం ఒకటి. అలాగే కోలీవుడ్ లో ఇటీవలే సుల్తాన్ సినిమాలో నటించింది రష్మిక. సూర్యతో సినిమా చేయడానికి ఓకే చెప్పింది. బాలీవుడ్ లో రెండు సినిమాల్లో నటిస్తోంది. మూడో సినిమా కూడా సైన్ చేసినట్లు ఇటీవలే చెప్పుకొచ్చింది.

ఇక హీరోలు, హీరోయిన్లు అందరికీ సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న.. మీ ఫెవరెట్ సినిమా ఏంటి అని, దానికి చాలా మంది నా ప్రతీ సినిమా నా ఫేవరెట్ అని చెబుతూ ఉంటారు. కొంత మంది తమ కెరీర్ లో సూపర్ హిట్ సినిమాలను పేర్కొంటారు కానీ రష్మిక ఈ విషయంలో ఎలాంటి మొహమాటం లేకుండా కుండబద్దలు కొట్టేసింది.

నా కెరీర్ లో మొదటి సినిమా అంటే కన్నడలో చేసిన కిరిక్ పార్టీ ఎప్పటికీ తన ఫేవరెట్ అని తెలిపింది. ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ భామ ఇప్పుడు టాప్ హీరోయిన్ అన్న విషయం తెల్సిందే.