అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయనున్న రష్మిక మందన్న


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతొంది రష్మిక మందన్న . ఛలో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన భామ రష్మిక మందన్న . ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తూనే ఉన్నాయి . ఇక గీత గోవిందం బంపర్ హిట్ తర్వాత ఈ భామ మరింతగా రెచ్చిపోతోంది . ఏకంగా ఇప్పుడు స్టార్ హీరో అల్లు అర్జున్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది .

రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ అనే చిత్రంలో నటిస్తోంది , ఆ సినిమా మే 31 న రిలీజ్ కానుంది . ఇక అల్లు అర్జున్ తన కొత్త సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నాడు అయితే రష్మిక మందన్న ని మాత్రం తీసుకుంది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా కోసం . ఆ సినిమా ఆగస్టు లో ప్రారంభం కానుంది కానీ సెట్స్ మీదకు వెళ్ళేది మాత్రం వచ్చే ఏడాదే !