గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన రష్మిక మందన్న


Rashmika Mandanna romance with Mahesh Babu

ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన భామ రష్మిక మందన్న గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది . ఏకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే గోల్డెన్ ఛాన్స్ లభించింది . ప్రస్తుతం మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాని కంప్లీట్ చేసిన తర్వాత వచ్చే ఏడాది వేసవిలో సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ నిర్మించనున్న చిత్రంలో నటించడానికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో మహేష్ తో రొమాన్స్ చేసే అదృష్టం రష్మిక మందన్న ని వరించింది .

మహేష్ బాబు తో నటించడం అంటే రష్మిక కు ప్రమోషన్ లభించినట్లే ! పాత్ర క్లిక్ అయితే స్టార్ హీరోయిన్ ల లీగ్ లో చేరిపోతుంది రష్మిక . అయితే రష్మిక ని ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది . ఛలో చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ సరసన గీత గోవిందం చిత్రంలో నటించింది రష్మిక ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఈ భామకు వరుసగా పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి . అయితే దేవదాస్ చిత్రం మాత్రం రష్మిక కు కాస్త బ్రేక్ వేసినట్లే అని అనుకుంటున్న సమయంలో మహేష్ బాబుతో సినిమా అంటే రష్మిక పంట పండినట్లే !

English Title: Rashmika Mandanna romance with Mahesh Babu