రెమ్యునరేషన్ విషయంలో సెటైరికల్ కామెంట్స్ చేసిన రష్మిక


Rashmika mandanna satires on her remuneration
Rashmika mandanna satires on her remuneration

చాలా తక్కువ సమయంలోనే రష్మిక మందన్న టాప్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నిలిచింది. ఆమె నటించిన ఒకట్రెండు సినిమాలు తప్ప మిగిలినవి అన్నీ సూపర్ హిట్స్ గా నిలవడంతో టాలీవుడ్ లో ఈమెను లక్కీ మస్కట్ గా కూడా భావిస్తున్నారు. గతేడాది సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో సూపర్ హిట్ ను సాధించింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ప సినిమాలో నటిస్తోంది రష్మిక. అదే కాకుండా బాలీవుడ్ లో కూడా పాగా వేయబోతోంది. ఆమె మొదటి బాలీవుడ్ చిత్ర షూటింగ్ ఇటీవలే మొదలైంది. ఈ నేపథ్యంలో రష్మిక రెమ్యునరేషన్ పై బోలెడన్ని రూమర్స్ వచ్చాయి.

రష్మిక తన పారితోషికాన్ని 2 కోట్లకు పెంచేసిందని అంటున్నారు. దీనిపై రష్మిక స్పందించింది. నిజంగా 2 కోట్ల పారితోషికం తీసుకోవడం ఇప్పటికీ నాకు కలే అని ఆమె సెటైరికల్ గా స్పందించింది.