రెండో హిందీ ప్రాజెక్ట్ కూడా పట్టేసిన రష్మిక మందన్న


రెండో హిందీ ప్రాజెక్ట్ కూడా పట్టేసిన రష్మిక మందన్న
రెండో హిందీ ప్రాజెక్ట్ కూడా పట్టేసిన రష్మిక మందన్న

కొన్ని రోజుల క్రితమే రష్మిక మందన్న హిందీ డెబ్యూ గురించి అధికారిక సమాచారం వచ్చిన విషయం తెల్సిందే. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తోన్న మిషన్ మజ్ను చిత్రంలో రష్మిక హీరోయిన్ గా ఎంపికైంది. శాంతను బాఘ్చి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా గురించి మరింత సమాచారం త్వరలో అందుతుంది.

ఇదిలా ఉంటే ఆమె మరో హిందీ అవకాశాన్ని పట్టినట్లు తెలుస్తోంది. అది కూడా సాదా సీదా సినిమా కాదు. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో నటిస్తోన్న చిత్రంలో రష్మిక ఆయన కూతురుగా నటించబోతోంది. తండ్రీ-కూతురు మధ్య నడిచే ఒక భిన్న కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. వికాస్ బహెల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. రిలియన్స్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మించబోతోంది. డెడ్లి అనేది టైటిల్ గా పరిగణిస్తున్నారు.

మరి ఈ రెండు సినిమాలతో రష్మిక బాలీవుడ్ లో పాగా వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. కన్నడ సినిమాతో రష్మిక హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా కూడా తెలుగులో ఎక్కువగా సినిమాలు చేసింది. ఈ ఏడాది కోలీవుడ్ లోకి కూడా ప్రవేశించింది. ఇక ఇప్పుడు హిందీ. చూస్తుంటే రష్మిక అన్ని భాషల్లోనూ టాప్ హీరోయిన్ అయ్యేలా ఉంది.