ముంబైలో ల‌గ్జ‌రీ ఫ్లాట్ కొనేసింది!

rashmika mandanna to settle in bollywood
rashmika mandanna to settle in bollywood

`ఛ‌లో` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న‌. తొలి చిత్రం బారీ విజ‌యాన్ని సాధించ‌డంతో ర‌ష్మికకు అవ‌కాశాలు క్యూ క‌ట్టాయి. ఆ త‌రువాత చేసిన `గీత గోవిందం` వంద కోట్ల క్ల‌బ్‌లో చేర‌డంతో ర‌ష్మిక స్టార్ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ నాయిక‌గా స్టార్ డ‌మ్‌ని ద‌క్కించుకుని స్టార్ హీరోల చిత్రాల్లో అవ‌కాశాల్ని ద‌క్కించుకుంటోంది.

మ‌హేష్‌తో `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంలో న‌టించిన ర‌ష్మిక ప్ర‌స్తుతం `పుష్ప‌`లో బ‌న్నీకి జోడీగా క‌నిపించ‌బోతున్న విష‌యం తెలిసిందే. ఇదే ఏడాది `మిష‌న్ మ‌జ్ను` పేరుతో రూపొందుతున్న హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే ఆమె చేసిన హిందీ సాంగ్ ఓ రేంజ్‌లో నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుండ‌గా క‌న్న‌డ‌, తెలుగు ఫ్యాన్స్‌కి ర‌ష్మిక బ్యాడ్ న్యూస్ చెప్పేసింది.

అదేంటంటే తెలుగు, త‌మిళ భాష‌ల్లో మాంచి రైజింగ్‌లో వున్న ర‌ష్మిక బాలీవుడ్‌కు మ‌కాం మార్చేలా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగానే ముంబైలో అత్య‌తం ఖరీదైన విల్లాని కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది. అమితాబ్ బ‌చ్చ‌న్‌తో క‌లిసి `డాడీ` చిత్రంలోనూ న‌టించే అవ‌కాశం రావ‌డంతో ర‌ష్మిక త‌న మ‌కాంని ముంబైకి మార్చ‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.