అన్నా, త‌మ్ముళ్ల‌తో క్రేజీ గాళ్ హంగామా!


అన్నా, త‌మ్ముళ్ల‌తో క్రేజీ గాళ్ హంగామా!
అన్నా, త‌మ్ముళ్ల‌తో క్రేజీ గాళ్ హంగామా!

తెలుగులో క్రేజీ ఆఫ‌ర్ల‌తో దూసుకునోతోంది క‌న్న‌డ సోయ‌గం ర‌ష్మిక మంద‌న్న‌. ఇటీవ‌ల సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టించిన `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రంతో త‌న‌దైన మేన‌రిజ‌మ్‌తో `మీకు అర్థ‌మ‌వుతోందా?.. అంటూ ఆక‌ట్టుకుంది. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్ల‌ని సాధించిన బ్లాక్ బ‌స్ట‌ర్‌కా బాప్ అనిపించుకుంది. ఈ సినిమా త‌రువాత ప్రస్తుతం యంగ్ హీరో నితిన్‌తో క‌లిసి రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `భీష్మ‌` చిత్రంతో న‌టిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ చివ‌రి ద‌శ‌కు చేరుకోవ‌డంతో మ‌రో చిత్రానికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేసింది.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో స్టైలిష్ స్టార్ బ‌న్నీ ఓ మాస్ మాసాలా ఎంట‌ర్‌టైనర్ చేస్తున్న విష‌యం తెలిసిందే. మైత్రీ మూవీమేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఇటీవ‌లే మొద‌లైంది. త్వ‌ర‌లో రెండ‌వ షెడ్యూల్ న‌ల్ల‌మ‌ల అడ‌వుల్లో లేదా చిత్తూరులో ప్రారంభించ‌బోతున్నారు. ఇందులో బ‌న్నీకి జోడీగా ర‌ష్మిక న‌టిస్తోంది. ఇదిలా వుంటే తెలుగులో స్టార్స్‌ని చుట్టేస్తున్న ర‌ష్మిక త‌మిళంలోనూ మొద‌లుపెట్టేసింది. ఇప్ప‌టికే కార్తితో క‌లిసి ఓ చిత్రంలో న‌టిస్తోంది. భాగ్యరాజ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి `సుల్తాన్‌`అనే టైటిల్‌ని ఫైన‌ల్ చేశారు.

ఈ సినిమాతో పాటు సూర్య‌తో మరో చిత్రాన్ని అంగీక‌రించిన‌ట్టు తెలిసింది. యాక్ష‌న్ చిత్రాల ద‌ర్శ‌కుడు హ‌రి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య ఓ చిత్రం చేయ‌బోతున్నారు. ఇందులో సూర్య‌కు జోడీగా మాళ‌వికా మోహ‌న‌న్‌ని అనుకున్నారు కానీ విజ‌య్ `మాస్ట‌ర్‌` చిత్రంలో బిజీగా వుండ‌టం వ‌ల్ల ఆ స్థానంలో ర‌ష్మికని తీసుకోవాల‌ని భావిస్తున్నార‌ట‌. ర‌ష్మిక కూడా సూర్య‌తో క‌లిసి న‌టించడానికి అంగీక‌రించ‌డంతో ఒకే సారి అన్నా త‌మ్ముళ్ల‌తో ర‌ఫ్మిక హంగామా చేస్తోంద‌ని కోలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు.