ర‌ష్మిక న్యూ ప్రాజెక్ట్స్ ప‌రిస్థితేంటి?


ర‌ష్మిక న్యూ ప్రాజెక్ట్స్ ప‌రిస్థితేంటి?
ర‌ష్మిక న్యూ ప్రాజెక్ట్స్ ప‌రిస్థితేంటి?

ర‌ష్మిక మంద‌న్న‌.. టాలీవుడ్‌లో ఇప్పుడు క్రేజీ హీరోయిన్‌. వ‌రుస హిట్‌ల‌తో టాప్ హీరోయిన్‌ల జాబితాలోకి చేరిపోయింది.  తెలుగులో ఎంట్రీ ఇచ్చిన `ఛ‌లో` నుంచి ఆమె వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు. నాగార్జున‌, నాని క‌లిసి న‌టించిన `దేవ‌దాస్‌` చిత్రాన్ని ప‌క్క‌న పెడితే ఛ‌లో, గీత గోవిందం, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ … ఇలా వ‌రుస విజ‌యాల్ని సొంతం చేసుకుంది.

ఈ వ‌రుస విజ‌యాల‌తో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌ల జాబితాలో చేరిపోయింది. ప్ర‌స్తుతం రెండు క్రేజీ ఆఫ‌ర్ల‌ని ద‌క్కించుకుంది. `అల వైకుంఠ‌పురములో` చిత్రంతో ఇండ‌స్ట్రీ హిట్‌ని సొంతం చేసుకున్న బ‌న్నీ త్వ‌ర‌లో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మాస్ మ‌సాలా ఎంటర్‌టైన‌ర్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో బ‌న్నీ లారీ డ్రైవర్‌గా క‌నిపించ‌బోతున్నారు.

ఈ సినిమాతో పాటు త‌మిళంలో కార్తి హీరోగా న‌టిస్తున్న `సుల్తాన్‌`లో న‌టిస్తోంది. ఇదే ర‌ష్మిక తొలి త‌మిళ సినిమా. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే వుంది. అయితే ఈ రెండు చిత్రాలు త‌ప్ప ర‌ష్మిక చేతిలో మ‌రో సినిమా లేక‌పోవ‌డం అనుమానాల్ని రేకెత్తిస్తోంది. ర‌ష్మిక `స‌రిలేరు నీకెవ్వ‌రు`, భీష్మ స‌క్సెస్‌ల త‌రువాత రెమ్యున‌రేష‌న్‌ని పెంచేసింద‌ట‌.

కోటికి పైనే డిమాండ్ చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. దాంతో ర‌ష్మ‌కిని తీసుకోవాలంటేనే ప్రొడ్యూస‌ర్స్ భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఈ కార‌ణంగానే నిర్మాత‌ల్ని ప్ర‌సన్నం చేసుకోవ‌డానికి ర‌ష్మిక ఫొటోషూట్‌లు చేస్తోంద‌ని తాజా టాక్‌.