విజయ్ దేవరకొండ మళ్ళీ కావాలంటున్న రష్మిక మందన్న


Rashmika Mandanna
Rashmika Mandanna

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో మళ్ళీ నటించాలని ఉందని అంటోంది రష్మిక మందన్న . ఇప్పటికే గీత గోవిందం చిత్రంలో నటించి సక్సెస్ ఫుల్ జంటగా పేరు తెచ్చుకున్నారు . కట్ చేస్తే ఇప్పుడు డియర్ కామ్రేడ్ చిత్రాన్ని చేస్తున్నారు ఈ ఇద్దరూ , ఇక ఆ సినిమా ఈనెల 26 న భారీ ఎత్తున విడుదల అవుతోంది . ఆ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ ఈ జంట పై రూమర్లు బాగానే వస్తున్నాయి .

ఇక రష్మిక మందన్న అయితే అందరి ముందే విజయ్ దేవరకొండ తో మళ్ళీ నటించాలని ఉందని , నీ తదుపరి సినిమాలో ఛాన్స్ ఇస్తావా ? అంటూ అడిగేసింది కొంటెగా నవ్వుతూ . దానికి విజయ్ దేవరకొండ చిరు నవ్వే సమాధానం అయ్యింది . ప్రస్తుతం ఈ ఇద్దరూ డియర్ కామ్రేడ్ ప్రమోషన్ లో చాలా బిజీ గా ఉన్నారు . ఇక ఈ సినిమా కూడా హిట్ అయితే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హాట్ పెయిర్ గా సంచలనం సృష్టించడం ఖాయం .